నేటి కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో కీలక రోల్ ప్లే చేస్తుంది అనడం సందేహం లేదు. మారుతున్న కాలనికి అనుగుణంగా సోషల్ మీడియా యువతకు ఓ గొప్ప వేదిక గా మారిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఇక వాటిలో సోషల్ మీడియా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుని ఇష్టమొచ్చిన్నట్లు వాడేస్తున్నారు జనాలు. అయితే ఈ సోషల్ మీడియా అద్దం లాంటిది..మీరు ఏం చేస్తే అదే కనిపిస్తుంది. మీరు మంచిగా ఉపయోగిస్తే .. రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుంది. అదే చెడ్డకు ఉపయోగిస్తే…నెగిటివ్ కనిపిస్తుంది.
ఇక అలా సోషల్ మీడియాను మంచి కి ఉపయోగించి బాగుపడిన వారు చాలామందే ఉన్నారు. వాళ్లల్లో దేతడి హారిక కూడా ఒకరు. తనలోని టాలెంట్ ను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తూ..భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా తెలంగాణ యాస లో మాట్లాడుతూ హారిక తనదైన స్టైల్ లో వెబ్ సిరీస్ లు,కవర్ సాంగ్స్..షార్ట్
ఫిలింస్ చేస్తుంటుంది. ఇక ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి వెళ్లి..టాప్ 5 కంటెస్టెంట్ ల లిస్ట్ లో నిలిచింది .
అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అమ్మడుకు పలు సినిమాల్లో ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఓ వైపు వెబ్ సిరీస్ లు చేసుకుంటూనే మరో వైపు..సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి అమ్మడు కి ఓ విషయంలో బాగా కోపం వచ్చిన్నట్లుంది. నిజానికి హారిక చూడటానికి కొంచెం పొట్టిగా ఉంటుంది. దీంతో చాలా మంది ఆమెను పొట్టి..బుడ్డది అంటూ ఏడిపిస్తున్నారట. ఒకటి రెండు సార్లు సరదాగా ఉన్నా పదే పదే అలా పిలిస్తుంటే చిరాకు వస్తుంది..ఆ తరువాత కోపం వస్తుంది. ఇక అలా పొట్టి అంటూ తనను ఏడిపించాడట ఓ యూట్యూబర్ .
నిజానికి వీళ్ల మధ్య పెద్ద గా ఫ్రెండ్ షిప్ లేకపోయినా పదే పదే పొట్టి అంటూ పిలవడంతో హారికకు కోపం వచ్చి..ఎన్టీఆర్ డైలాగ్ ను వాడుతూ..ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్ర్తూ.. అర్థమైంది కదా.. అని ట్రోలర్స్‌కు ఇచ్చిపదేఅసింది. ప్రస్తుతం హారిక పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.