బండ్ల గణేష్, త్రివిక్రమ్, పవన్.. ఈ ముగ్గిరి మధ్య ఏం జరుగుతుంది?

పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన ఉండకపోవచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో మాత్రం ఆయన తప్పకుండ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయనే. ఆయన స్పీచ్ ఇస్తే వినాలని ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు. ఈశ్వర పరమేశ్వర అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడటం ఆయనకు మాత్రమే సొంతం. ఇంత ఇంట్రడక్షన్ చేస్తున్నానంటే ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకెవరు నిర్మాత నటుడు బండ్ల గణేష్. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.ఇక పవన్ కళ్యాణ్,రానా, త్రివిక్రమ్ ఎవరికివారు స్పీచ్ ఇరగదీశారు.

అటు ప్రేక్షకులు మాత్రం బండ్ల గణేష్ స్పీచ్ మిస్సయ్యారు.. సరేగాని బండ్లగణేష్ భీమానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు రాలేదు అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ఈ కార్యక్రమానికి ముందు రోజు త్రివిక్రమ్ నన్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావద్దు అని అంటున్నాడు.. మంచి డైలాగులు రాసుకున్నా.. నాకేమో రావాలని ఉంది అంటూ బండ్ల గణేష్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ఆడియో నాది కాదు ఈ విషయంపై నేను స్పందించాలి అనుకోవట్లేదు అంటూ బండ్ల గణేష్ స్పందించాడు. హామ్మయ్య ఆడియో తనది కాదు అన్నాడు అంటే ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్లన్న రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

కానీ తీరా చూస్తే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ రానేలేదు. దీంతో ఏం జరిగింది.. వైరల్ గా మారిపోయిన ఆడియో నిజమేనా.. త్రివిక్రమ్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఏం జరుగుతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. పూట పూటకి ఒక్కో పార్టీ చెప్పే బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ దూరం పెట్టారేమో అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటే.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అన్నది హాట్ టాపిక్ గా మారిపోయిన నేపథ్యంలో ఇక బండ్ల గణేష్ వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక బీమ్లా నాయక్ సినిమా కి మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అని త్రివిక్రమ్ బండ్ల గణేష్ కు భీమానాయక్ ప్రీ రిలీస్ ఈవెంట్ కు ఆహ్వానించలేదు అని మరో చర్చ జరుగుతోంది. ఇక ఈ విషయం పై త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఎలాగో స్పందించరు.. బండ్ల గణేష్ స్వయంగా స్పందించి చెబితే అందరికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Share post:

Latest