వాళ్లతో నా ఆశ తీరలేదు..అలాంటి మగాడి కోసం వెయిటింగ్..కళ్యాణి ఓపెన్ కామెంట్స్..!

కరాటే కళ్యాణి.. ఈ పేరు గురించి స్పెషల్ గా చెప్పాలా చెప్పండి. టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేయించుకుంది. మన ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడే నటీ నటులు చాలా తక్కువ. అలాంటి వాళ్లల్లో కళ్యాణి కూడా ఒకరు. ఊరికే తను ఎవ్వరి జోలికి పోదు..తన జోలికి వచ్చారా..తాట తీసేస్తుంది. ఎక్కడ కష్టం అన్న తనకు తెలిస్తే తనకు తోచిన సహాయం అందించే కళ్యాణి అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం. సినిమాల్లో కొంచెం బోల్డ్ క్యారెక్టర్లల్లో నటిస్తుందన్నమాటే కానీ..బయట మాత్రం ఆమె క్యారెక్టర్ వేరేలా ఉంటుంది.

తెలుగులో ఎన్నో సినిమాల‌లో పాపులర్ క్యారెక్టర్ పాత్రల‌లో నటించిన ఆమె ఇటీవల తరచూ ఏదో ఒక కాంట్రవర్సీ అంశాలతో వార్తల్లోకి ఎక్కుతునే ఉన్నారు. కరాటే కళ్యాణి ప్రారంభంలో హరికథలు చెప్పేవారు.. ఇక అలా ఆ తర్వాత సినిమాల మీద ఉండే ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చారట..కానీ ఆమెకు అలాంటి పాత్రలు రాకపోవడంతో మనలోని టాలెంట్ చూయించాలి అంటే హీరోయిన్ పాత్రలే చేయినవసరం లేదు..అనుకుని.. వచ్చిన పాత్రల్లో నటిస్తూ..తనదైన స్టైల్లో ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ ప్రారంభంలో చిన్నాచితక పాత్రలు వేసిన కళ్యాణి ఆ తర్వాత మంచి పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గోన్న కళ్యాణి..తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా కళ్యాణి తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..” చాలా మంది ఆడది అంటే వంటింటికి పరిమితం అని అనుకుంటారు. భర్త చెప్పిందే వినాలి..వాళ్లు చెప్పినదానికి ఊ కొట్టాలి అంటే నా వల్ల కాదు. తప్పు చేస్తే తిట్టినా పర్లేదు..కాని తప్పు చేయకుండా ఉంటే చిన్న మాట అన్నా కూడా ఊరుకోను. నా వైవాహిక జీవితంలో నేను కరెక్ట్ గానే ఉన్నా, కానీ నా భర్తకి నా పై అనుమానం ..తాగి వచ్చి రోజు కొట్టేవాడు.. చేయని తప్పు ను నా మీద వేస్తుంటే భరించలేకపోయా..విడాకులు ఇచ్చేసా. లాస్ట్ కి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా ..ఆ దేవుడే నన్ను కాపాడాడు. నేను పడిని కష్టాలు ఏ ఆడది పడిఉండదు” అని చెప్పుకొచ్చింది.

మళ్లీ పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ..” ఖచ్చితంగా చేసుకుంట. నాకు పిల్లలు అంటే ఇష్టం. నా రెండు వివాహాలతో అది జరగలేదు. నాకు పిల్లలు కావలనే ఆశ అలానే ఉండిపోయింది. నిజమైన ప్రేమను నాకు అందించే మగాడు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా..లేదా సహజీవనం అయినా చేస్తా..” అంటూ ఓపెన్ గా తన మనసులోని మాటలను బయటపెట్టేసింది కళ్యాణి.

Share post:

Latest