పుష్ప 2 లో మరో స్టార్ హీరో..సుక్కు నువ్వు సూపరహే.. ?

లెక్కల మాస్టర్ సుకుమార్ ఏ పని చేసినా దానికి ఓ ప్రత్యేకమైన రీజన్ ఉంటుంది. అందుకే అయినా స్టార్ డైరెక్టర్ అయ్యారు, ఇక ఈ మధ్యనే బన్నీ తో పుష్ప అనే మూవీని తెరకెక్కించి .. గ్రాండ్ గా రిలీజ్ చేసి..బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా పై మొదట్లో కొంచెం నెగిటివ్ టాక్ వినిపించినా..ఇక రాను రాను క్రేజీ కామెంట్స్ అందుకుంటూ..సూపర్ హిట్ దిశగా దూసుకుపోయింది.

ఈ సినిమా ఎలాంటి ఘన విజయం అందుకుందంటే..బన్నీ కెరీర్ లోనే ఇప్పటి వరకు ఏ సినిమా కలెక్ట్ చేయలేనన్ని కోట్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా లో బన్నీ పర్ ఫామెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంతవరకు పోని మాస్ లుక్ జోలికి వెళ్లడం ఒక సాహసం అయితే..ఆ భాష యొక్క యాశ..చెప్పే డైలాగ్స్ ..నేచురాలిటీ..పుష్ప సీన్స్ కు తగ్గట్లే ఇచ్చే ఎక్స్ ప్రేషన్స్..అమ్మ బాబోయ్ మనం ఇప్పటి వరకు చూడని బన్నీ ని ఈ సినిమాలో చూడవచ్చు.

ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉందని..ముందే సుకుమార్ అనౌన్స్ చేశాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వనుందట. కాగా మనంలో పుష్ప 1 లో చూడని ముఖాలని..పుష్ప 2 లో చూడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ కి సపోర్ట్ గా ఓ బాలీవుడ్ బడా హీరో ని దింపబోతున్నారట సుకుమార్. ఎందుకంటే బాలీవుడ్‌ లో పుష్ప సినిమా రూ. 100 కోట్లపైనే వసూలు చేసింది. నిజానికి సుక్కు అక్కడ అస్సలకి ప్రమోషన్స్ నే చేయలేదు. కానీ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో హిందీ ప్రేక్షకులను ఓన్‌ చేసుకునేందుకు సుక్కు అక్కడి లోకేషన్స్‌లోనే పుష్ప 2ను షూటింగ్‌ కూడా జరపాలని అనుకుంటున్నాడట. ఇక ఈ క్రమంలోనే సినిమాకి మంచి హైప్‌ ఇచ్చేందుకు బాలీవుడ్ స్టార్ హీరోను ని పుష్ప 2 లో కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నారని అంటున్నారు. మరి చూడాలి సుక్కు ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..?

Share post:

Popular