“మీ సార్ గబ్బర్ సింగ్ అయితే.. మరి నేను ఎవరో తెలుసా?”..రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తరువాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ప్రేక్షకులను పలకరించడానికి భీమ్లా నాయక్ సినిమతో రాబోతున్నాడు. సినిమా అనౌన్స్ చేసిన్నప్పటి నుండి కూడా ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. పవర్ స్టార్ సినిమా..పైగా పోలీస్ ఆఫిసర్..దానికి తోడు పవన్ ను ఢీ కొట్టే పాత్రలో రానా దగ్గుబాటి. ఇంకేం కావాలి చెప్పండి అభిమానులకు. మధ్య మధ్యలో తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..పవన్ అభిమానులకు పూనకాలు వచ్చేయవు.

ఈ సినిమాని ధియేటర్స్ లో చూడాలి అని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్లే పలు కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఫైనల్ గా ఈ నెల 25 న మన చూస్తున్నారు రాబోతున్నాడు భీమ్లా నాయక్. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ..హైద్రాబాద్‌లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపారు సినిమా మేకర్స్. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా కేటీఆర్ గారు వచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ని ఆయన సినిమాలని ఓ రేంజ్ లో పొగిడేశారు.

అయితే ఈ ఈవెంట్ లో అందరి కన్నా జనాలను ఎక్కువ ఆకట్టుకున్న స్పీచ్ ఎవరిదంటే..అది ఖచ్చితంగా రానాదే. ఈ చిత్రంలో పవన్ కు సరిసమానంగా ఉండే విలన్ పాత్రలో నటించారు ఆయన. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా మాట్లాడుతూ..ఎత్తుకోవడం ఎత్తుకోవడమే..పవర్ ఫుల్ డైలాగ్ చెప్తూ..”మీసార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట.. మరి నేను ఎవరో తెలుసా?” అంటూ భీమ్లా నాయక్ సినిమాలో డైలాగ్ చెప్పుతాడు. దీంతో అభిమానుల అరుపులు కేకలతో గ్రౌండ్ దద్దరిల్లింది. ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ స్పిచ్ ఇస్తూ..”నేను యాక్టర్ అయ్యి 12 ఏళ్లు అయ్యింది.. తెలుగు సినిమాలు చేశాను.. హిందీ సినిమాలు చేశాను కానీ..పవన్ కళ్యాణ్ గారితో నటించి నేర్చుకున్న మూమెంట్స్ చాలా విలువైనవి..నన్ను ఈ సినిమాలోకి తీసుకున్నందుకు త్రివిక్రమ్ కి చాలా ధ్యాంక్స్ “అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు.