భీమ్లా నాయక్: ఆ ఒక్క పాయింట్ తప్పిస్తే.. సినిమా కేవ్వుకేక అంతే..!!

పవన్ రీ ఎంట్రీ తరువాత వచ్చిన రెండో సినిమా భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి-పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కిన సినిమా కొద్ది గంటల ముందే ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముందు నుండి అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో అభిమానుల ఆకలి తీర్చేశాడు. నిజాకి వకీల్ సాబ్ చిత్రం హిట్ అయినా కానీ పవన్ అభిమానులు కోరుకున్న ఎలిమెంట్స్ ఆ సినిమాలో తక్కువ గానే ఉన్నాయి. కానీ ఈ సినిమాలో పవన్ చెప్పే ఒక్కో డైలాగ్..ఆ కళ్లలో చూపించే కోపం .. అబ్బబ్బా ఒకటా రెండా ఎన్నో..అది చెప్పితే సరిపోదు..మన కళ్లతో మనమే చూడాలి. అప్పుడు అసలైన కిక్ వస్తుంది.

ఇక సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే..ఈ మూవీ కి డైరెక్టర్ సాగర్ అని చాలా మంది మర్చిపోయారు. భీమ్లా నాయక్ సినిమా చూస్తున్నంత సేపు మనకి తెర పై త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కానివ్వండి.. ఆ కోపాని కంట్రోల్ చేసుకునే పద్ధతి కానివ్వండి.. భార్యతో నటించే సీన్స్ కానివ్వండి..ఇలా మనం సినిమా చూస్తున్నంత సేపు మనకు త్రివిక్రమ్ నే కనిపిస్తారు. ఏదో అక్కడక్కడ సాగర్ స్క్రీన్ ప్లే తెలుస్తుంది తప్పిస్తే..మిగతా అంతా మాటల మాత్రికుడు నడిపించిన్నట్లే ఉంది.

కాగా ఈ సినిమా లో అంతా బాగునప్పటికి చివర్లో పవన్ కల్యాన్ ని దేవుడి గా చూపించే ప్రయత్నం చేసారు మేకర్స్. అది కొంచెం ఓవర్ గా అనిపించింది తప్పిస్తే. ఈ సినిమాలో వెళ్లు పెట్టి చూపడానికి ఏం లేదు. బాగా ఆకలి గా ఉన్నవాడికి కడుపునిండా భోజనం పెడితే ఎలా ఉంటుంది..ఇప్పుడు అలాంటి ఫీలింగ్ నే ఎంజాయ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజన్స్, రానా పెర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్ కోసం “భీమ్లా నాయక్”ను తప్పకుండా చూడాలి ఏమాటకు ఆ మాటే పవన్ కల్యాణ్ స్టైలే వేరబ్బా..అంటూ ధియేటర్స్ బయట డప్పులు కొడుతూ డ్యాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు.