బుకింగ్స్‌లో దుమ్ము రేపుతోన్న భీమ్లా నాయ‌క్‌… ప‌వ‌న్ స్టామినా త‌గ్గేదేలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాక ఇప్పుడు వ‌రుసెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న మ‌ళ‌యాళ హిట్ సినిమా అయ్య‌ప్ప కోషియ‌మ్‌కు రీమేక్‌గా వ‌చ్చిన భీమ్లానాయ‌క్ సినిమాలో న‌టించాడు. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమాకు ముందు ఒక రోజు అజిత్ న‌టించిన వాలిమై తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.

ఇక వ‌కీల్‌సాబ్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఇప్ప‌టికే మ‌ల్లూవుట్‌లో హిట్ అవ్వ‌డం, ఈ సినిమాలో ప‌వ‌న్తో పాటు రానా కూడా న‌టిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక త్రివిక్ర‌మ్ హ్యాండ్ కూడా ఉండ‌డంతో సినిమాపై ట్రేడ్ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. వాస్త‌వానికి ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ టైంలో రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు క‌రోనా సెకండ్ వేవ్‌తో పాటు ఏపీలో టిక్కెట్ రేట్ల‌ను ఒక్క‌సారిగా త‌గ్గించేశారు.

దీంతో ఆ సినిమా టాక్ బాగున్నా అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు అయితే రాలేదు. అయితే ఇప్పుడు భీమ్లానాయ‌క్ ఖ‌చ్చితంగా సెన్షేష‌న‌ల్ అవుతుంద‌నే అంటున్నారు. ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా భీమ్లా రిలీజ్‌కు ముందే దుమ్ము రేపుతోంది. ప‌వ‌న్ సినిమాకు అక్క‌డ ఎప్పుడూ టాప్ లేచిపోయే మార్కెట్ ఉంటుంది. ఇప్ప‌టికే అక్క‌డ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

యూఎస్‌లో ఇప్ప‌టికే 2 లక్షల డాలర్లు ఈ సినిమా క్రాస్ చేసేసినట్టుగా తెలుస్తుంది. దీంతో భీమ్లానాయ‌క్ సినిమాపై ఎలాంటి హైప్ ఉందో అర్థ‌మ‌వుతోంది. రిలీజ్‌కు ముందే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత మ‌రిన్ని సంచ‌ల‌నాలు రేప‌డం ఖాయం.

Share post:

Popular