జ‌గ‌న్ ఎఫెక్ట్‌… ఫ‌స్ట్ డే భీమ్లానాయ‌క్‌కు భారీ దెబ్బ‌.. ఎన్ని కోట్లు లాస్ అంటే…!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “భీమ్లా నాయక్” . ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా అద్భుత‌మైన టాక్ తెచ్ఉకుంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా అదిరిపోయే వ‌సూళ్లు సొంతం చేసుకుంది.
నైజాంలో భీమ్లా నాయక్ భారీ వసూళ్లతో ఫ‌స్ట్ డే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్క‌డ అద‌న‌పు షోల‌తో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునే అనుమ‌తులు కూడా ఉన్నాయి.

అయితే ఏపీలో భీమ్లానాయ‌క్‌కు భారీ షాక్ త‌ప్ప‌లేదు. ప్ర‌భుత్వ అధికారుల త‌నిఖీలు, నిబంధ‌న‌లు క‌ఠినంగా ఉండ‌డంతో ఈ సినిమా తొలి రోజు అనుకున్న స్థాయిలో వ‌సూళ్ల ద‌క్కించుకోలేదు. రెవెన్యూ అధికారులు ఏపీ అంత‌టా తొలి రోజే సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద భారీగా త‌నిఖీలు చేశారు. దీంతో తొలి రోజు రావాల్సిన షేర్‌లో భీమ్లానాయ‌క్‌కు రు. 10 కోట్ల న‌ష్టం వాటిల్లింది.

ఇక గ‌తేడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్‌సాబ్ ఓ మోస్త‌రు టాక్‌తోనే ఏకంగా ఏపీలో రు 23.6 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అదే భీమ్లానాయ‌క్ కేవ‌లం రు 14.5 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అంటే రు. 10 కోట్ల షేర్ జ‌గ‌న్ స‌ర్కార్ ఎఫెక్ట్‌తో భీమ్లానాయ‌క్ కోల్పోవాల్సి వ‌చ్చింది. వ‌కీల్‌సాబ్ వ‌చ్చిన‌ప్పుడే టిక్కెట్ రేట్ల త‌గ్గింపు జీవో జారీ చేసినా నాలుగైదు రోజులు దానిని ఎవ్వ‌రూ అమ‌లు చేయ‌లేదు. దీంతో అప్పుడు వ‌కీల్‌సాబ్‌కు నాలుగైదు రోజులు భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఆ త‌ర్వాత భారీగా టార్గెట్ చేయ‌డంతో వ‌కీల్‌సాబ్ సినిమా వ‌సూళ్లు ప‌డిపోయాయి ఏదేమైనా ఇప్పుడు మామూలుగా ప‌ల్లెల్లో రు. 5, రు. 10, రు. 15, రు. 20 కు అమ్ముకోవాల్సి రావ‌డంతో వ‌సూళ్లు ఘోరంగా ఉన్నాయి.