గోపీచంద్ చించేసాడు..గూస్ బంప్స్ వచ్చేలా బాలయ్య 107 టైటిల్..ఫ్యాన్స్ కు పూనాకాలే..?

నందమూరి నట సింహం బాలకృష్ణ ..యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా..ఇంకా పక్కాగా చెప్పాలంటే వాళ్లకంటే కూసింత ఎక్కువుగానే..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..కమిట్ అయిన సినిమాలను వెంటనే తెరపైకి ఎక్కిస్తూ..తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు. నాతో నాకే పోటి..నాకు లేరు సాటి అన్న రీతిలో బాలయ్య ఫుల్ జోష్ మీద అటు సినిమాలో నటిస్తూ..ఇటు హోస్ట్ గా చేస్తూ..అదే టైంలో రాజకీయాలల్లోను తన దైన మార్క్ చూయిస్తున్నాడు. ఇక ఈ మధ్యన అఖండ అనే సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న ఈయన..ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఫస్ట్ టైం బాలయ్య పక్కన స్టార్ డాటర్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ పాత్ర గమ్మత్తుగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక బాలయ్యను డీ కొట్టే పాత్రలో మరో స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నట్లు ఈ మధ్యనే చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు. దీంతో సినిమా పై భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ సినిమా నుండి అభిమానులకు ఊపు తెప్పించే మ్యాటర్ లీకైంది .

ఇన్నాళ్లు ఈ సినిమాకి టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు నెట్టింట హల్ చల్ చేసాయి. కానీ ఈ విషయంలో మేకర్స్ ఫైనల్ డెసీషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. గోపీచంద్ మల్లినేని-బాలయ్య కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు “జై బాలయ్య ” అనే టైటిల్ ఫిక్స్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ గా మారింది. సినిమా టైటిల్ ను రీజిస్టర్ చేసే క్రమంలో ఈ వార్త లీక్ అయ్యిన్నట్లు సమాచారం. బాల‌య్య‌కు కూడా టైటిల్ బాగా న‌చ్చింద‌ట‌. అంతే కాదు, త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నారని..అందులో ఒకటి ఫ్యాక్షన్ లీడర్ రోల్ కాగా మరోకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ రోల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని.. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, ఈ సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నిర్మాతలు కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ యూఎస్ఏలో జరుగుతుంది.

Share post:

Popular