పెళ్లి గిల్లి వద్దు..అది మాత్రం కావాలి.. స్టార్ హీరో మాటలకు షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

సినీ ఇండస్ట్రీలో రాను రాను పరిస్ధితులు దిగజారిపోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పలువురు ప్రముఖులు. ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే ఇండస్ట్రీలో లో పరిస్ధితులు కూడా అలానే ఉన్నాయి. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో లవ్,డేటింగ్, రొమాన్స్, లు కామన్ గా ఉంటాయి. అది ఇప్పుడు కాదు ఎప్పటి నుండొ నడుస్తున్న వ్యవహారం. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని విషయాల్లో నటీ నటులు శృతిమించుతున్నట్లు తెలుస్తుంది. పెళ్లి అనే పదానికి అర్ధం మార్చేస్తున్నట్లు ఉంది. ఇప్పటికే కొంత మంది హీరో హీరోయిన్లు డేటింగ్ పేరుతో పెళ్లి అనే పవిత్ర బంధాని రూపే మార్చేసారు.

పెళ్లికాకుండానే ఓ అబ్బాయి..అమ్మాయి అన్నీ పనులు ఫినిష్ చేయడం. తీరా వాళ్లు గర్భం దాల్చాక పెళ్లి చేసుకోవడం. ఇదే ఛండాలం అని అనుకుంటుంటే మరికొందరు ఏమో ఏకంగా పెళ్లికి ముందే బిడ్డను కనేసి..తీరా పెళ్లి టైంకి మా మధ్య బాండింగ్ కుదరడం లేదు అంటూ ఎదవ రీజన్ లు చెప్పి పెళ్లి నుండి తప్పించుకుని..వేరే వాళ్లతో మళ్ళీ పనులు మొదలపెట్టడం. ఇలా చేసి పెళ్లి కి ఉన్న వాల్యు ని తీసేస్తున్నారు కొందరు హీరో హీరోయిన్లు. రీసెంట్ గా అలాంటి పనే చేసాడు ఇక్కడ ఓ స్టార్ హీరో. సార్..కి పెళ్లి వద్దంట..కానీ పిల్లలు మాత్రం కావాలట . ఈ మాటలకు ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. తన నటనతో అధ్బుతమైన పర్ ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంటాదు. విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ అర్జున్ రాంపాల్ తన భార్య మెహర్‌ జెసియాకు విడాకులిచ్చేసి.. మరో నటి అయిన గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు. చాలా కాలం నుండి నుండి ఈ యవ్వారం కొనసాగుతుంది..దానికి ఫలితంగా ఓ బాబు కూడా పుట్టాడు. సరే బాబు పుట్టాడు గా ఇక నైనా పెళ్లి చేసుకుంటారులే అని అనుకున్న అభిమానులకు షాక్ ఇచ్చాడు. మా మధ్య ఉన్న బంధాన్ని నిరూపించుకోవడానికి కేవలం కాగితం ముక్కలు అవసరంలేదని చెప్పుకొస్తున్నాడు. మా మనసులు కలిసినరోజే మా పెళ్లి అయిపోయినట్లేనని సినిమాటిక్ డైలాగ్స్ చెప్పుతూ కవర్ చేస్తున్నాడు. అంతేనా పెల్లి కాకపోయినా మేము భార్యభర్తల కన్నా తక్కువేమి కాదని అంటున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Popular