టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని ర్యాగింగ్ చేసిన ఎన్టీఆర్

టాలీవుడ్‌లో ఇవివి సత్యనారాయణ చనిపోయిన తరువాత ఇవివి ప్లేస్ చాల కాలం ఎవరు రీప్లేస్ చేయలేదు.ఆ తరువాత కాలంలో డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి ఆ ప్లేస్ని భర్తీ చేసాడు ర‌చ‌యిత‌గా కెరీర్ స్టార్ చేసిన ఈయ‌న‌.. నంద‌మూరి కళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `ప‌టాస్‌` మూవీతో డైరెక్ట‌ర్‌గా పరిచయం అయిన అనిల్ రావిపూడి ఆ త‌ర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలను చేసాడు .అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్నాడు. ఇలా వరుస హిట్ చిత్రాలను డైరెక్టర్ చేసిన అనిల్ రావిపూడి.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌నూ షేర్ చేసుకున్నారు.

అనిల్ రావిపూడి మాటల్లో ఆయనేమన్నారో ఒకసారి చూద్దాం .జూనియర్ ఎన్టీఆర్ న‌న్ను ర్యాగింగ్ చేశాడంటూ ఓ షాకింగ్ విష‌యాన్ని కూడా బ‌య‌ట పెట్టేశారు.`పటాస్ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తరచూ ఆఫీస్‌కి వస్తుండేవారు. ఆయన వచ్చినప్పుడల్లా నన్ను తెగ ర్యాగింగ్‌ చేసేవారు. ర్యాగింగ్‌ అంటే బాధ పెట్టడం కాదు అల్లరి చేస్తూ నా పై జోకులు వేసేవారు. నాక‌ది ఎంతో మెమరబుల్ ఎక్స్పీరియన్స్` అంటూ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.దాంతో ఆయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest