బిగ్ షాక్ :ఏంటిది సారూ..రాత్రికి రాత్రి లెక్కలు మార్చేశారా..?

అనసూయ.. ఈ పేరు కు కొత్త పరిచయాలు అక్కర్లేదు లేండి. యాంకర్ గా కెరీర్ ప్రాంభించి..ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అందాల తార ఈ అనసూయ. యాంకర్ గా ఆమె ఎంత పాపులర్ అయ్యిందో తెలియదు కానీ.. ఆమె వేసే బట్టలు ద్వారా మాత్రం బాగా ట్రోలింగ్ కు గురి అవుతుంది. అనసూయ కు పెళ్లై.. ఇద్దరు కొడుకులు ఉన్నారు. కానీ, ఆమె ను చూస్తే ఎవ్వరు అలా అనుకోరు..అంతలా కత్తి లాంటి ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తుంది ఈ హాట్ యాంకరమ్మ.

ప్రస్తుతం సినిమాలు, షోలతో ఫుల్ బిజీ ఉన్న .. అనసూయా చాలా సినిమాలో నటించింది. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అమ్మడుకి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక అలాంటి సినిమాలే క్షణం.. రంగస్థలం..పుష్ప, యాత్ర లాంటి మూవీలు. ఈ సినిమాలో అమ్మడు పర్ ఫామెన్స్ కి అందరు ఫిదా అయ్యారు. ఇక రీసెంట్ గా ఖిలాడి సినిమాలో తన అందాలు ఆరబోస్తూ క్రేజీ లుక్స్ తో ఆకట్టుకున్న అనసూయకి మరో డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు ఖరారైపోయినట్లే అని సమాచారం.

రంగస్ధలం లో చరణ్ పక్కన నటించిన ఈ భామ..ఇప్పుడు ఆయన తండ్రి మెగాస్టార్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు “భోళ శంకర్” అని పేరు కూడా డిసైడ్ చేశారు. ఈ సినిమా లో కీర్తి సురేష్ చిరు కి చెల్లిగా నటిస్తుంటే..హీరోయిన్ గా తమన్నా ను ఫిక్స్ చేసారు డైరెక్టర్. అయితే , ఈ సినిమాలో విలన్ గా మొన్నటి వరకు ఓ మలయాళ నటుడిని అనుకున్నారు రమేష్. దాదాపు ఆయన ఫిక్స్ అయ్యిన్నట్లే..రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది అని అనుకునేలోపే తెర పై కి షాకింగ్ మ్యాటర్ లీక్ అయ్యింది.

భోళా శంకర్ సినిమాలో విలన్ గా అనసూయ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కానీ మెయిన్ విలన్ గా కాదు..ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటించేలా క్యారెక్టర్ ను డిజన్ చేసారట రమేష్. చిరంజీవి పక్కన చేసే ఛాన్స్ వస్తే ఎవ్వరు వదులుకుంటారు చెప్పండి..ఆ పాత్ర చేయడానికి అనసూయ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమా కావటంతో ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండ అనసూయ ఓకే చెప్పటం జరిగిందట. ఇక త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రోజు రోజుకు అనసూయ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. చూడాలి ఈ ఊపుడు ఎంత కాలం ఉంటాదో..?