గ్లింప్స్ తో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన “మేజర్”

మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాశం ఆధారం గా అడివి శేష్ హీరోగా సోని పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. అడివి శేషు నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రంను సూపర్ స్టార్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ ,టీజర్ చూశాక అభిమానాలు ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు .అయితే కరోనా తో సినిమాని ఓటీటీ వస్తది అనుకున్నారు .కానీ దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది .

తాజాగా మేజర్ సినిమా నుండి మరొక అప్డేట్ ను ఒక చిన్న గ్లింప్స్ ద్వారా చిత్ర బృందం వెల్లడించింది .అదేమిటంటే ఈ చిత్రం ను మే 27, 2022 వ తేదీన థియేటర్ల లో భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. తాజాగా విడుదల అయిన వీడియో కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.మేజర్ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Share post:

Latest