సమంత కట్టుకున్న ఈ చీర రేటు తెలిస్తే..దిమ్మతిరగాల్సిందే..!!

చీర కట్టుకోవడం మన సాంప్రదాయం. ఏ అమ్మాయికైనా చీర కడితే వచ్చే కళ మరే డ్రెస్ వేసిన రాదు. మీరు గమనించండి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చీర కడితే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. చీరలో అదేదో తెలియని మాయ ఉంది. ఇక ఆడవాళ్లుకు ఓ అలవాటు ఉంటుంది. ఎన్ని చీరలు ఉన్నా .. ఇంకా కావలి అని అనిపిస్తుంది. వేరే వాళ్ళు కట్టుకున్న చీర ను చూసి కుళ్లుకుంటూనే ..ఇలాంటి చీర మన దగ్గర లేదు అనుకుంటేనే..అబ్బే ఈ చీర ఏం బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తారు. లేకపోతే ఇంత డబ్బు ఈ చీరకు వేస్ట్ అంటూ మాట్లాడుతుంటారు. ఇలాంటివి మన ఇళ్లల్లోని ఫంక్షన్ లో చాలా సార్లు చూసుంటాం . అయితే ఇప్పుడు అలాంటి కామెంట్స్ నే ఎదురుకుంటుంది స్టార్ హీరోయిన్ సమంత.

ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో నెట్టింట ట్రెండింగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఓ చీర విషయంలో నెగిటీవ్ కామెంట్స్ ను అందుకుంటుంది. రీసెంట్ గా సమంత ఓ శారీ కట్టుకుని ఫోటో షూట్ చేసింది. ఆ చీర లో చూడటానికి కుందనపు బొమ్మలా ఉన్న ఈమె కోసం.. ఆ చీరను నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసి మరీ ఇచ్చిందట. ఇక ఆ చీర కట్టుకుని అద్భుతమైన లుక్‌ తో ఆకట్టుకుంటోంది సామ్.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ చీర ఖరీదు తెలుసుకున్న అందరు షాక్ అవుతున్నారు. ఈ చీర కోసం అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఈ చీర కోసం అక్షారాల..1,14,999.రూపాయిలు ఖర్చు చేసారట. ఈ విషయానికి తెలుసుకున్న అభిమానులకి దెబ్బకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అభిలాషా ప్రెట్ జ్యువెలరీ ద్వారా స్టేట్‌మెంట్ చెవిపోగులతో కన్పించిన సామ్ చీర ధర రూ.1,14,999. ఉన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సమంత మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.