నాగ చైతన్య ఫస్ట్ వైఫ్ నేను కాదు..షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన సమంత..!!

ఈ జంటను తెర పై చూసిన్నప్పుడే అనుకున్నారు వీళ్ళు మనల్ని ఏదో మాయ చేస్తున్నారు అని. ఫైనల్ గా అదే జరిగింది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమంత..అక్కినేని కుర్రాడి చూపులకి, మాటలకు ఫిదా అయిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే అదే..చైతన్య సమంత ల విషయంలో జరిగింది. చూడగానే నచ్చేసిన ..ఇద్దరు బయటపడకుండా మ్యానేజ్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా లవ్ చేసుకుంటూ..ఫైనల్లీ ఇంట్లో వాళ్లకు చెప్పి షాక్ ఇచ్చారు. వాళ్లు షాక్ అయ్యారు ఏమో కానీ జనాలు కాదు. వీళ్ల మధ్య ఏదో నడుస్తుందని..జనాలకు ఎప్పుడో అర్ధమైపోయిది. దీంతో చైతన్య సమంత పెళ్లిని అంగరంగ వైభోగంగా జరిపించారు నాగార్జున.

అబ్బో ఒకటా రెండా పెళ్లి కి ముందు ఫంక్షన్లు..పెళ్లిలో సమంత మామ నాగార్జున తో చిందులు..చైతన్య తో రొమాన్స్ లు..అదో పండగలా జరిగింది. అప్పట్లో వీళ్ల అపెళ్లి వార్తలు ప్రతి నేషనల్ మీడియా..లోకల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. పెళ్లి అయ్యాక కూడా ఈ జంట హనీమూన్ లంటూ తిరిగి ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసి..బ్యాచిలర్స్ కుర్రాళ్ళ కడుపు మంటకు కారణ మైయారు. సీన్ కట్ చేస్తే పాలు నీళ్ళు లా కలిసి కనిపించిన ఇ ప్పుడు ఉప్పు నిప్పులా చిటపటలాడుతున్నారు. ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఇక విడాకుల తరువాత సమంత ముందు ఇంటర్వ్యుల్లో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడు తన భర్త చైతన్య గురించి చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా ట్రేండ్ అవుతున్నాయి. అప్పట్లో మంచు లక్ష్మి హోస్ట్ చేసిన షో కి గెస్ట్ గా వెళ్లిన సమంత..మాటల సంధర్భంలో నాగచైతన్యకు మొదటి భార్య తన పిల్లో అని..నేను కాదు అని..ఎప్పుడు దానినే హగ్ చేసుకుని పడుకుంటాడు అని..నేను ఎప్పుడైన ముద్దు పెట్టుకుందాం అనుకున్నా ..ఆ పిల్లో అడ్డు వచ్చేదని..ఫనీ గా చై పై కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు విడాకుల తరువాత ఆ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని పూర్తి చేసింది. అలాగే సమంత యశోద అనే చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు ఓ హాలీవుడ్ మూవీ కి సైన్ చేసిన సమంత..మరో రెండు బడా సినిమాలను లైన్లో పెట్టుకోనుంది.

Share post:

Latest