జిమ్‌లో ప్ర‌గ‌తి ఆంటీ అరాచ‌కం చూస్తారా… ఈ వ‌య‌స్సులో ఇదేం అరాచ‌కం (వీడియో)

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా రాత్రికి రాత్రే సెల‌బ్రిటీలు అవుతున్నారు. ఇక వెట‌రన్ హీరోయిన్లు, న‌టీమ‌ణులు కూడా త‌మ అంద‌చందాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌ట‌పెడుతూ తాము ఇప్ప‌ట‌కీ లైమ్‌టైమ్‌లో ఉన్నామ‌ని జ‌నాల‌కు చూపించుకుంటున్నారు. సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌గ‌తి ఇప్పుడు ఆంటీ, అమ్మ పాత్ర‌ల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది.

ఆమె త‌న వ‌య‌స్సుతో సంబంధం లేకుండా కాస్త హాట్‌గా ఉండే ఫొటోల‌తో పాటు జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేసే ఫొటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆమె జిమ్‌లో చేసే వ‌ర్క‌వుట్ల వీడియోలు ఎలా షేర్ చేస్తుందో ? చూస్తూనే ఉన్నాం. ఆమె ఎప్పుడూ త‌న అంద‌చందాల విందుతో సోష‌ల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా ప్ర‌గ‌తి ఆంటీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తోన్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా ప్రగతి చేస్తున్న కసరత్తులు చూసి ఫిదా అవుతున్నారు.
ప్ర‌గ‌తి ఆంటీ తెలుగు సినిమాల్లో అమ్మ‌, అత్త‌, అక్క‌, వ‌దిన పాత్ర‌ల్లోఫుల్ బిజీగా ఉంది. సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌కు కూడా ఎఫ్ 2 సినిమాలో అమ్మ‌గా న‌టించి అద‌ర గొట్టేసింది. ఎన్నోసార్లు ఆమె త‌న పాత్ర‌ల ద్వారా ఉత్తమ స‌హాయ‌న‌టి అవార్డు కూడా గెలుచుకుంది. ప్ర‌గ‌తి ఆంటీ వ‌ర్క‌వుట్లు చేస్తోన్న వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Share post:

Popular