వ్యాపారాల్లో సత్తా చాటుతున్న సినీ స్టార్స్..

అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి. ఇదే సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతున్నారు పలువురు సినిమా హీరోలు. ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. సినిమాల ద్వారా వస్తున్న డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. టాలీవుడ్ లో ఎంటర్ పెన్యూర్లుగా రాణిస్తున్న స్టార్స్ ఎవరో? వారు చేస్తున్న బిజినెస్ లు ఏంటో? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ బ్యానర్ నెలకొల్పాడు. దీని ద్వారా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. అటు ఏషియన్ కంపెనీతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నాడు. హైదరాబాద్ సహా పలు నగరాల్లో వీటిని విస్తరిస్తున్నాడు. అటు వస్త్రవ్యాపారంలోకి కూడా మహేష్ బాబు దిగాడు. తన పేరిటే ఓ క్లాథింగ్ బ్రాండ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఈ బిజినెస్ ను తన భార్య నమ్రత పర్యవేక్షిస్తుంది. అటు రాంచరణ్ కూడా నిర్మాతగా మంచి సినిమాను నిర్మిస్తున్నాడు. అటు విమాన వ్యాపరంలోనూ కొనసాగుతున్నాడు. ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ పేరిట విమానాలను నడుపుతున్నాడు. అటు తన తండ్రితో కలిసి విశాఖలో సినిమా స్టూడియోల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా పబ్ ల వ్యాపారంలోకి దిగాడు. ఏఏఏ బ్రాండ్ పేరుతో మల్టీప్లెక్స్ కూడా నిర్మిస్తున్నాడు. అటు అల్లు అరవింద్ తో కలిసి ఆహా అనే ఓటీటీని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ ఔటర్ లో సినిమా స్టూడియో నిర్మాణం చేపడుతున్నారు.

అటు ప్రభాస్ తన ఫ్రెండ్స్ తో కలిసి మల్టీప్లెక్స్ ల నిర్మాణంలో ముందుకు సాగుతున్నాడు. అటు నాగార్జున, చిరంజీవి సైతం పలు వ్యాపారాలుచేస్తున్నారు. ఈ ఇద్దరికి రేసింగ్ కంపెనీతో పాటు, ఫుట్ బాల్ టీం లు కూడా ఉన్నాయి. హోటల్స్ తో పాటు మల్టీఫ్లెక్స్ ల నిర్మాణంలోనూ ముందుకు వెళ్తున్నాడు నాగార్జున. పబ్ లు కూడా ఉన్నాయి. అటు నాగ చైతన్య కూడా తండ్రికి అండగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ కూడా పలు బిజినెస్ లు చేస్తున్నాడు. మల్టీఫ్లెక్స్ ల నిర్మాణంతో పాటు వస్త్ర వ్యాపారంలోనూ కొనసాగుతున్నాడు. అటు శర్వానంద్, దర్శకుడు సురేందర్ రెడ్డి, పలువురు నిర్మాతలు దాబాలు, హోటల్స్ రన్ చేస్తున్నారు.