నాకుంది ఆ రెండే.. క్లారిటీ ఇచ్చిన కాంట్రవర్సీ భామ

శ్రీరెడ్డి.. తన బరువైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో కుర్రకారుకు కనువిందు చేస్తుంది. ఆమె వేసుకునే డ్రెస్సులు, పెట్టే ఫోజులు మామూలుగా ఉండవు. తన అందాలన్నీ బయట పెడుతూ ఏవేవో విషయాల గురించి మాట్లాడుతుంది. అంతేకాదు.. ఈ అమ్మడు.. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంది. ఓ యాంకర్ గా తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన ఈమె.. పలు కాంట్రవర్సీలతో ముందుకు సాగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తను నానా రచ్చచేసి పాపులర్ అయ్యింది. సినిమాలు, రాజకీయాలు అనే తేడా లేదు.. తనకు ఏది తోస్తే దాని గురించి నోటికి ఎంత మాట వస్తే అంట మాట అనేస్తుంది.

ప్రస్తుతం శ్రీరెడ్డి హైద‌రాబాద్ తో పాట చెన్నైలోనూ ఉంటుంది. దీంతో తను ఆస్తులు బాగానే కూడబెట్టింది అని చాలా మంది అనుకుంటారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పింది. హైద‌రాబాద్‌లో రెండు ప్లాట్లతో పాటు బీఎండ‌బ్ల్యూ, ఆడి లాంటి లగ్జరీ ఉన్నాయ‌ట క‌దా? అని యాంకర్ అడిగిన ప్రశ్నలకు తను సమాధానం చెప్పింది. తనకు హైదరాబాద్ లో మాత్రమే సొంత ఇల్లు ఉందని చెప్పింది. ఓ ఆడి కార్ కూడా ఉందని వెల్లడించింది. మిగిలిన ఆస్తులు ఏవీ లేవని చెప్పిం. తాను ప్రస్తుతం చెన్నైలో అద్దెకు ఉంటున్న ఇల్లు ఓ అపార్ట్ మెంట్ లో చాలా చిన్నది అని చెప్పింది. ఈ మధ్య కాలంలో తాను సంపాదించిన సంపాదన ఏమీ లేదని చెప్పింది. తల్లిదండ్రుల సపోర్టు లేని అమ్మాయిలకు సొంతంగా ఇల్లు ఉండాలని చెప్పింది. లేదంటే ఎవడో ఒకడు వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావ్? అలా చేస్తున్నావ్? ఇల్లు ఖాళీ చెయ్ అనే బాధ తప్పుతుందని చెప్పింది.

ప్రస్తుతం తన సొంత ఇంట్లో చాలా స్వేచ్ఛగా ఉంటున్నట్లు చెప్పింది. రాజకీయ పార్టీల విషయంలో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఉంటానని.. సొంత ఇల్లు లేకపోయి ఉండి ఉంటే ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేవారని వెల్లడించింది.

Share post:

Popular