సామి సామి పాటతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఫోక్ సింగర్ రాజలక్ష్మి..

తాజాగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా పుష్ప. ఇందులో సామి.. సామి.. అనే పాట గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఈ పాట ఓరేంజిలో పాపులర్ అయ్యింది. అన్ని భాషలతో పాటు టిక్ టాక్ లాంటి యాప్స్ లోనూ దుమ్మురేపుతుంది. అయితే తమిళంలో ఈ పాట పాడిన రాజలక్ష్మి సెంథిల్ గణేష్ హావభావాలు తమిళ్ లిరికల్ సాంగ్‌కు మంచి పేరు తెచ్చాయి. ఇన్‌స్టాగ్రాంతో పాటు యూట్యూబ్‌లోనూ ఆమె పాట మస్తు వైరల్ అవుతోంది. ఆమె ఆ పాట పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

అటు జానపద పాటలేకాదు.. జానపద పాటలతో టీవీ షోలలో అలరించిన ఎందరో గాయనీ గాయకులు ఇప్పుడు సినిమా పాటలతో మంచి ఫాలోయింగ్ పొందుతున్నారు. గాయని మంగ్లీ చెల్లి ఇంద్రావతి తాజాగా పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అంటూ జనాలను ఊపేసింది. ఒకే ఒక్కపాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్రావతి ఊ అంటావా అనే పాటకు ఇచ్చిన హావభావాలు కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. అటు సామి.. సామి అంటూ రాజ్యలక్ష్మి పాడిన పాట కూడా బాగా హైలెట్ అయ్యింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు.

తమిళ జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్యలక్ష్మి సొంతూరు తమిళనాడులోని పుదకొట్టైకి సమీపంలోని కారంబక్కుడి. ఆమె గ్రామాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాల్లో పాటలు పాడేది. ఈ క్రమంలోనే సెంథిల్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి తమిళ్ ఫోక్ మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించారు. వాటికి మంచి క్రేజ్ వచ్చింది. యూట్యూబ్ లోనూ ఓ చానెల్ మొదలు పెట్టారు. Senthil Rajalakshmi పేరుతో రన్ చేస్తున్న ఈ చానెల్ దాదాపు 3 లక్షల ఫాలోవర్లను కలిగి ఉంది. తాజాగా పుష్ప సినిమాలో ఆమె పాడిన పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట దుమ్ము రేపుతోంది.