రాజమౌళి పవన్ కళ్యాణ్ కి ఎందుకు అన్యాయం చేసాడు?

కరోనా వైరస్ ఆంక్షలతో ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. కానీ ఈ సినిమా విడుదలకు మాత్రం కరోనా వైరస్ ఎప్పుడు అడ్డు పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు గత రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకవైపు కరోనా వైరస్ పెరిగిపోవడం కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనే భయం ఉంటే.. మరోవైపు థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ నడుస్తూ ఉండటం.. ఏపీలో టికెట్ల ధరలు తక్కువగా ఉండడంతో ఇక సినిమాలకు నష్టాలు తప్పవు అని ఎంతో మంది నిర్మాతలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇటీవలే త్రిబుల్ ఆర్ రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సంక్రాంతి రేసులో పూర్తి మార్పులు వచ్చేశాయి

త్రిబుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతికి జనవరి 7న విడుదల చేస్తామని ప్రకటించడంతో చిన్న సినిమాలన్నీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. ఏకంగా జనవరిలో కాదు ఫిబ్రవరిలో తమ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అటు రాజమౌళి ఒత్తిడి కారణంగానే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా వాయిదా పడిందన్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. అనూహ్యంగా సంక్రాంతి బరి నుంచి త్రిబుల్ ఆర్ సినిమా తప్పకోగా ఫిబ్రవరిలో విడుదల బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి చెప్పుకోదగ్గ పోటీ కూడా లేకపోవడంతో బంగార్రాజు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.

మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం దూసుకుపోతుంది బంగార్రాజు సినిమా. ఒకవేళ రాజమౌళి ఒత్తిడి చేయకపోతే ఉంటే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా ఉండేది. ఈ క్రమంలోనే సో సో టాక్ తెచ్చుకున్న బంగార్రాజు సినిమా కి భీమ్లా నాయక్ సినిమా గట్టిపోటీ ఇవ్వడమే కాదు మంచి విజయాన్ని కూడా సాధించేది. కానీ రాజమౌళి కారణంగానే వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ఎంతో నష్టం చేకూర్చిందనే టాక్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది