పిల్లల కోసం ప్రియాంక దంపతుల ఫ్యూచర్ ఫ్లాన్స్ ఏంటో తెలుసా?

ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ అమ్మడు.. హాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడ కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతుంది. బాలీవుడ్ లోనూ ఇండియన్స్ సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంత కాలం క్రితం పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. తన కంటే నిక్ వయసులో 10 ఏండ్లు చిన్న. తొలి రోజుల్లో అంత చిన్న వాడితో ప్రియాంక లైఫ్ ను ఎలా లీడ్ చేస్తుంది? వీరిద్దరు కలిసి ఎన్నాళ్లు ఉంటారు? అంటూ చాలా మంది చాలా రకాల ప్రశ్నలు లేవనెత్తారు. కానీ వారి అనుమానాలకు వీరిద్దరు చక్కటి సమాధానాలే చెప్తున్నారు. ప్రస్తుతం వీరద్దరు పుట్టబోయే పిల్లల కోసం ఎన్నో రకాల ప్లాన్లు చేశారట. వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో వారికి సరిపడ ఆస్తులను కూడబెడుతున్నారట.

ప్రియాంక, నిక్ దంపతులు తాజాగా లాస్ ఏంజిల్స్ లో దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. తమ అభిరుచికి తగిన విధంగా దాన్ని డిజైన్ చేయించారు. పిల్లలు కూడా పెద్దవారయ్యాక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదుకు అన్ని అవసరాలకు అనుగుణంగా ఉండేలా మరీ ఈ ఇంటి నిర్మాణం చేయించారట. పిల్లల భవిష్యత్ కు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఇందులో తగు జాగ్రత్తలు తీసుకున్నారట. సరోగసి ద్వారా వీరిద్దరు అప్పుడే పేరెంట్స్ అయినా.. మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు సుముఖంగా ఉన్నారట.

తాజాగా ప్రియాంక తల్లి అయిన నేపథ్యంలో పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు. నిద్ర లేని రాత్రులు అనుభవించేందుకు రెడీ గా ఉండాలంటూ అనుష్కశర్మ ట్వీట్ చేసింది. ఈమెతో పాటు పలువురు బాలీవుడ్ పెద్దలు సైతం ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. భవిష్యత్తులో వీరి బిడ్డలు ఎంతో సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. వారి కోసమే ప్రియాంక, నిక్ దంపతులు భవిష్యత్ ప్రణాళికలు వేశారని చెప్తున్నారు.

Share post:

Popular