6 నెలల్లో 5సినిమా విడుదల.. మాంచి ఊపుమీదున్న క్యూట్ బ్యూటీ

కృతి శెట్టి.. కన్నడ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో తన కెరీర్ నే పెద్ద మలుపు తిప్పుకుంది. ఉప్పెన సినిమాతో ఈ అమ్మడుకి ఉప్పెనలా అవకాశాలు వస్తున్నాయి. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 6 నెలల వ్యవధిలో 5 సినిమాల రిలీజ్ లతో తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్లాన్ చేసింది. అందాలను ఆరబోస్తూ.. అంగాంగ ప్రదర్శన చేస్తున్న ఈ రోజుల్లో అభినయ అవకాశం ఉన్న పాత్రల్లో చేస్తూ మంచి అవకాశాలను దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. వరుసగా 5 సినిమాల్లో అవకాశం కొట్టేసింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపించింది. ఈ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది. అయితే మళ్లీ నటనా ప్రాధాన్యత ఉన్నన సినిమాలకే మొగ్గు చూపుతోంది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగ రాయ్ కూడా తనకు మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఈ సినిమా విడుదల తర్వాత నెల రోజుల వ్యవధిలోనే సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో జనాల ముందుకు వస్తోంది. నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో తను ఊరి ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేస్తోందట.

అటు సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమలో నటించింది. ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి లేదంటే మార్చిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఇప్పటికే ఏప్రిల్ లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇందులోనూ ఈ ముద్దుగుమ్మ మంచి క్యారెక్టర్ చేస్తుంది. అటు హీరో రామ్-లింగుస్వామి కలిసి తీస్తున్న మరో సినిమా కూడా సమ్మర్ బరిలో నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా 6 నెలల్లో 5 సినిమాలతో మంచి స్పీడులో ముందుకు సాగుతుంది కృతి శెట్టి.

Share post:

Popular