కండలు తిరిగిన దేహంతో కళ్యాణ్ దేవ్.. మీరు చూశారా?

ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోలు సినిమాలు అవసరమైతే సిక్స్ ప్యాక్ లు చేస్తూ కండలు పెంచుతు ఉండటం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో అందరికీ షాక్ ఇచ్చారు. స్టార్ హీరోలకు ఎక్కడ నేను తక్కువ కాదు అనుకున్నాడో ఏమో ఇక ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా కండల వీరుడిగా మారిపోయాడు. మొన్నటి వరకు క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించిన కళ్యాణ్ దేవ్ ఇప్పుడు ఒక సినిమా కోసం కండలు పెంచేసాడు.

ఇటీవలే జిమ్ లో కష్టపడుతున్న ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ ఫోటోలు చూసి అభిమానులు అందరూ ఒక్క సారిగా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.. వామ్మో కళ్యాణ్ దేవ్ ఏంటి ఇలా మారిపోయాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ ఎవరైనా మీరు ఇది చేయలేరు అంటే కేవలం నవ్వుతూ చూడమని చెప్పండి అంటూ ఇక ఈ ఫోటోలకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చేసాడు కళ్యాణ్ దేవ్. కాగా ప్రస్తుతం రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కిన్నెరసాని అనే సినిమాలో కళ్యాణ్ దేవ్ నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమా కోసమే ఇలా కండలు పెంచి నట్లు తెలుస్తోంది.

 

ఏదేమైనా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కండలు తిరిగిన దేహంతో కనిపించడంతో సినిమాల్లో క్లిక్ కావడానికి కళ్యాణ్ దేవ్ బాగానే కష్టపడుతున్నాడు అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల సూపర్ మచ్చి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ దేవ్ కు మరోసారి నిరాశే ఎదురైంది. మెగా బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇకపోతే మెగాస్టార్ కూతురు శ్రీజ తో కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే..