కండలు పెంచి ఓకే.. కానీ బడ్జెట్ పెంచితే ఎలా.. అఖిల్ కోసం అంతనా?

సాధారణంగా స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు తక్కువ సమయంలోనే స్టార్ లుగా మారి పోతూ ఉంటారు. కానీభారీ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కు మాత్రం ఇప్పటికీ సరైన స్టార్ డమ్ రాలేదనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో అనుకున్నంతా స్టార్ డమ్ మాత్రం సంపాదించ లేక పోతున్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటీవలే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మోస్తరు హిట్ సాధించాడు అఖిల్. ఇక ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ కొట్టాలి అనే పట్టుదలతో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

ఇక దీనికోసం అఖిల్ ఎంతగానో కష్టపడి పోతున్నాడు అన్న విషయం తెలుస్తుంది. ఏ విషయంలో కూడా కాంప్రమైస్ కావడం లేదట. ఇక ఏజెంట్ సినిమా కోసం అటు దర్శకుడు సురేందర్రెడ్డి క్యూట్ గా ఉండే అఖిల్ తో భారీగా కసరత్తులు చేయిస్తూ బిబీస్ట్ లా తయారు చేస్తున్నాడు. ఇక సిక్స్ ప్యాక్ కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే తన బాడీని మార్చుకున్నాడు అఖిల్. ఇక ఏజెంట్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు అనే విషయాన్ని ఒక్క ఫోటో తోనే అని చెప్పకనే చెప్పాడు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా బడ్జెట్ విషయంలోనే గత కొంత కాలం నుంచి వినిపిస్తున్న టాక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సురేందర్ రెడ్డి అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే భారీ బడ్జెట్ తో సైరా సినిమా తీసి నష్టాలు మిగిల్చారు సురేందర్రెడ్డి. ఇక ఇప్పుడు అఖిల్తో కూడా భారీ బడ్జెట్ పెట్టిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో చిరంజీవి లాంటి స్టార్ హీరోతో నే వసూళ్లు రాబట్టి లేకపోయినా సురేందర్రెడ్డి అఖిల్ తో అన్ని వసూళ్లు చేయగలుగుతాడా అన్న టాక్ కూడా మొదలైంది. అఖిల్ సినిమా కి మరి అంత భారీ బడ్జెట్ పెడితే మాత్రం నష్టాలు తప్పవంటూ కొంత మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

Share post:

Popular