ఎన్టీఆర్ అభిమానులకి పండగలాంటి వార్త

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద్ సమేత’ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయ్యింది . రాజమౌళి దర్శకత్వం లో మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ లో నటించటంలో అందరకి తెలిసిందే . ఎన్టీఆర్ ని మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడా చూస్తామని చుసిన అభిమానులకి నిరాశే ఎదురవుతుంది .

‘ఆర్ ఆర్ ఆర్ ‘ జనవరి 7 రిలీజ్ డేట్ ప్రకటించగానే ఎన్టీఆర్ అభిమానులలో పండగ వాతావరణం వచ్చింది . వాళ్ల ఆనందం వెంటనే ఓమిక్రాన్ వైరస్ రూపంలో ఆవిరైపోయింది.మళ్లీ ఆర్ ఆర్ ఆర్ వాయిదాపడింది ,రిలీజ్ ఎప్పుడంటే ఎవరకి ఇంకా క్లారిటీ లేదు .ఆర్ ఆర్ ఆర్ సినిమా రిజల్ట్ తెలియకుండానే ఎన్టీఆర్ రెండు కొత్త ప్రాజక్టులు మొదలపెడుతున్నాడు .

ఇది ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్తే , కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెలలోనే ప్రారంభం అవుతుందంట. ఉప్పెన సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు . బహుశా అది కూడా ఈ ఇయర్ లో నే మొదలుపెడతాడంట . కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తో నెక్స్ట్ ఇయర్ లో సినిమా ఉంటుందంట. ఏది ఏమైనప్పటికి ఎన్టీఆర్ అభిమానులకి ఈ వార్త సంతోషాన్ని కలిగించేదే .