కాస్కో ప్రేక్షకుడా .. ఏప్రిల్ లోనే సినిమా పండగ రాబోతుంది

నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతాయి. ఆ తర్వాత సమ్మర్ పెద్ద సీజన్ సినిమాలకు. హాలీడేస్ ఎక్కువగా ఉండే సమ్మర్ ను టార్గెట్ చేసుకుని తమ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. అందుకే ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతాయి. అందుకే సంక్రాంతికి మిస్ అయిన సినిమాలను ఏప్రిల్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వాస్తవానికి ఏప్రిల్ నెలను ఫస్ట్ బ్లాక్ చేసుకుంది పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ప్రభాస్ సలార్. కానీ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. క్రిష్ ఈ సినిమాలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడట. దీంతో ఏప్రిల్ నుంచి జూలైకి ఈ సినిమా వాయిదా పడింది. అటు ప్రభాస్ సలార్ ప్లేస్ ను కేజీఎఫ్2తో రీప్లేస్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ బదులు ఏప్రిల్ 14న కేజీఎఫ్2 విడుదల కాబోతుంది. అటు ఫిబ్రవరిలో వస్తుందనుకున్న అమీర్ లాల్ సింగ్ చద్దా.. ఏప్రిల్ 14కు విడుదల కాబోతుంది. అటు సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఏప్రిల్ 1నే విడుదల చేసేలా దర్శకుడు పరుశురాం ప్రయత్నిస్తున్నాడు.

అటు తాజాగా ఏప్రిల్ నెలలోనే తన సినిమాను కూడా విడుదల చేయాలని అని భావిస్తున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. బీస్ట్ సినిమాను ఏప్రిల్ లో జనాల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాడు. నిజానిక ఈ సినిమా సంక్రాంతికే రావాలి. కానీ అజిత్ వాలిమై సినిమా విడుదల అవుతుండటంతో తన సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశాడు. అటు ఏప్రిల్ 29న నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం అదే డేట్ తో ఎఫ్-3ని రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. అటు కంగనా-ధక్కడ్, మాధవన్-రాకేట్రి, టైగర్ ష్రాఫ్-హీరోపంటి2, అమితాబ్, అజయ్ దేవగణ్-రన్ వే 34 సహా పలు సినిమాలు కూడా ఏప్రిల్ లో విడుదలకు రెడీ అవుతున్నాయి.

Share post:

Popular