తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న లిటిల్ నయనతార..

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు జనాలు. ఈ ప్రపంచంలో ఆ ఏడుగురు ఎక్కడో ఒక చోట ఉండే ఉంచొచ్చు కూడా. అయితే ఒక హీరోయిన్ ను పోలిన మనిషిని చూస్తే.. ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి కూడా సెలబ్రిటీ అయితే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. అవును.. అచ్చం సౌత్ టాప్ హీరోయిన్ నయనతార లాగే మరో అమ్మాయి ఉంది. తను కూడా సినిమాల్లో నటించడం విశేషం. ఇంతకీ తను ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

నయనతార ప్రింటులా ఉండే ఆ అమ్మాయి మరెవరో కాదు.. అనిఖా సురేంద్రన్. అచ్చం నయనతారని పోలి ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తను కూడా సెలబ్రిటీనే. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది. 2015లో తమిళ స్టార్ హీరో అజిత్, దర్శకుడు గౌతమ్ మీనన్ చేసిన మూవీ యెన్నై అరిందాల్. ఈ సినిమాలో అనిఖా నటించింది. ఇందులో హీరోయిన్ త్రిష కూతురుగా నటటించింది. ఇదే సినిమా తెలుగులో ఎంతవాడుగాని అనే పేరు తో విడుదల అయ్యింది. ఈ చిన్నారి తెలుగు జనాలకు కూడా మంచి పరిచయం.

ఈ సినిమా తర్వాత తమిళంతో పాటు కొన్ని మలయాళం సినిమాల్లోనూ నటించింది. అటు 2019లో వచ్చిన అజిత్ మూవీ విశ్వాసం సినిమాలోనూ నటించింది. ఇందులో అజిత్-నయనతార కూతురుగా నటించింది. ఈ సినిమా ద్వారా జనాలకు మరింత చేరువైంది. అటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన వెబ్ సిరీస్ క్వీన్ లో యంగ్ జయ లలిత క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. ఈమె ఇప్పటికే తన నటనకు గాను పలు అవార్డులు అందుకుంది. తాజాగా ఈ అమ్మడు నేరుగా తెలుగు సినిమా చేస్తుంది. మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కప్పేలా అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్, నవీన్ చంద్ర హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అనిఖా యాక్ట్ చేస్తుంది.

Share post:

Popular