మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు.. మొదలైన అంతిమయాత్ర..!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమ యాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు సినీ,రాజకీయ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళి అర్పించారు.

టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, శ్రీకాంత్,రాజశేఖర్, జీవిత, నరేష్, త్రివిక్రమ్, నాని, రానా, డి.వి.వి.దానయ్య అల్లుఅరవింద్, అశ్వినీదత్, ఎంఎస్ రాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, నాగ్ అశ్విన్, మురళీమోహన్, శివాజీ రాజా, రామజోగయ్య శాస్త్రి,కౌసల్య, బుర్రా సాయిమాధవ్ లతో పాటు రాజకీయ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, పేర్ని నాని, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరికాసేపట్లో మహా ప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంతిమ యాత్రలో రోడ్డుకు ఇరువైపులా అభిమానులు భారీగా చేరుకుని నివాళి అర్పిస్తున్నారు.

Share post:

Popular