ఉత్కంఠ రేపుతున్న దృశ్యం -2 అఫిషియల్ ట్రైలర్..!!

విక్టరీ వెంకటేష్ , సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా నటిస్తున్న సినిమా దృశ్యం టు. ఈ సినిమా దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, మీనా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి, ఆంటోని పెరంబదూర్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో చంటి ,ముక్కు అవినాష్, తాగుబోతు రమేష్ వంటి తదితరులు కమెడియన్ లుగా నటిస్తున్నారు. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న దృశ్యం టు సినిమా అఫిషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కాస్త ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడమే కాకుండా, అతి తక్కువ సమయంలోనే కొన్ని వేల వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. థియేటర్ ను రన్ చేసుకునే వెంకటేష్ ఒక సినిమాకు ప్రొడ్యూసర్ గా ఈ సినిమాలో సక్సెస్ అయ్యాడా.. దృశ్యం సినిమా లో మిస్టరీని ఈ సినిమాలో ఛేదించారా లేదా అనే విషయాలను చక్కగా చూడవచ్చు. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది.

Share post:

Latest