ట్రాన్స్ జెండరే నా బెస్ట్ ఫ్రెండ్.. ఉపాసన షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక అందులో ఉపాసన అంటే మెగా అభిమానులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈమె ఎంతో దయాగుణంతో నిరుపేదలకు సైతం సహాయం చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది వాటి విషయాలను చూద్దాం.

ఆ ఇంటర్వ్యూలో ఇంటర్యూయర్ ఉపాసనను ఇలా అడిగింది. బంగారు , వెండి కంచాలలో తిని పెరిగే వాళ్ళు వీళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవు.. కోట్లకు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు కదా అలాంటప్పుడు వీళ్ళకు ఎటువంటి సమస్యలు వస్తాయి అని అందరూ అనుకుంటారు. ఇలాంటి రూమర్స్ కి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు అని అడగగా దానికి సమాధానంగా ఉపాసన.. సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు నిరుపేదలైన సరే డబ్బున్నవాళ్ళు అయినా సరే.. నా సమస్య ఏంటో మీకు తెలియదు మీ సమస్య ఏంటో నాకు తెలియదు.. ఎప్పుడైతే నా సమస్యలను మీరు గౌరవిస్తారు అప్పుడు నేను కూడా మిమ్మల్ని గౌరవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎదుటివాళ్ళు చూసేదాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో అర్థం అవుతుంది అంటూ వివరణ ఇచ్చింది.

స్ట్రాంగ్ ఉమెన్ ను అబ్బాయిలు భరించగలరా అనే ప్రశ్న ఉపాసనకు ఎదురవగానే.. మరి స్ట్రాంగ్ అబ్బాయిలను అమ్మాయిలు భరించగలరా..? నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒక ట్రాన్స్ జెండర్.. అక్షయ్ కుమార్ తనకు బాగా సపోర్ట్ చేస్తారు.. లక్ష్మి బాంబ్ సినిమాలో నటించిన ట్రాన్స్జెండర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఉపాసన తెలిపింది.. స్ట్రాంగ్ గా ఉండడానికి అమ్మాయి, అబ్బాయి అనే తేడా అంటూ ఉండదు.. ఇప్పటికైనా అభివృద్ధి చెందండి.. అమ్మాయి, అబ్బాయి అని వేరు చేసి మాట్లాడకండి..ధైర్యం విషయంలో దయచేసి అమ్మాయి అబ్బాయి అని కంపేర్ చేయకండి అంటూ ఆమె సొసైటీని రిక్వెస్ట్ చేసుకుంటోంది.

Share post:

Latest