టీ 20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల …!

టీ 20 వరల్డ్ కప్ 2021 ముగిసిన రెండు రోజులకే టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదిక గా జరుగనున్న పురుషుల టీ 20 వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మొత్తం 45 మ్యాచులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అందులో ఈ ఏడాది జరిగిన టీ20 డేట్లనే ఒక రోజు ముందుకు మార్చారు. ఎప్పటిలాగే రెండు గ్రూపులుగా చేసి ముందుగా సూపర్ 12 మ్యాచ్ ల ద్వారా సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేస్తారు.

అయితే మొదటగా అక్టోబర్ 13 న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్గగనిస్థాన్, బంగ్లాదేశ్, ఇప్పటికే సూపర్ 2 సాధించాయి. ఈ మెగా టోర్నీ కి సంబంధించిన మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్ జనవరిలో ప్రకటిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.

Share post:

Latest