వామ్మో..పునీత్‌ స్మారకం వ‌ద్ద‌కు రోజూ అంత మంది వ‌స్తున్నారా?

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన చెందిన సంగ‌తి తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టుడియోలో పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

Puneeth's BP and heartbeat were normal: Doctor who first examined the actor on Oct 29 | The News Minute

అయితే అక్టోబరు 31న అంత్యక్రియలు జరిగినప్పటి నుంచీ పునీత్ స్మారకం వ‌ద్ద‌కు ప్ర‌తి రోజు సగటున 30,000 మంది వ‌స్తున్నార‌ట‌. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 లక్షల మంది అభిమానులు ఆయ‌న‌కు నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికార‌ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక పేర్కొంది.

Kollywood heartbroken over the shocking demise of Puneeth Rajkumar | Tamil Movie News - Times of India

ఈ నేప‌థ్యంలోనే కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్, బెంగళూరు సిటీ పోలీసులతో సహా దాదాపు 300 మంది పోలీసులు ప్ర‌తి రోజు అక్కడ బందోబ‌స్తుగా ఉంటున్నార‌ట‌. ఇక నిన్న‌టికి పునీత్ మరణించి 11 రోజులు అయ్యాయి . ఈ సందర్భంగా పునీత్ కుటుంబీకులు 11వ రోజు సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తుంచారు. అలాగే మ‌రోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న‌ ఆయన అభిమానులు అన్నదానం, నేత్రదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు.

Share post:

Popular