పవన్-నితిన్ పోరుకు సిద్ధం..!

యంగ్ హీరో నితిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి మనకు తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ కు కూడా నితిన్ అంటే చాలా ఇష్టం. నితిన్ నటించిన చల్ మోహన్ రంగా సినిమాకు నిర్మాత బాధ్యతలను పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో మనకు అర్థం అవుతుంది.

అయితే తాజాగా బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కు పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు నితిన్. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అభిమానులు. నితిన్ హీరోగా, M.S. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం.”మాచర్ల నియోజకవర్గం”. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్నికల ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుతున్నారు.

ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. 29-4-2022 న విడుదల చేయబోతున్నారని తెలియజేశారు. ఇక అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నితిన్ తన అభిమాన హీరో తోనే పోటీ పడతాడో.. లేక రిస్క్ ఎందుకని సైడ్ అవుతాడో వేచి చూడాల్సిందే.

Share post:

Latest