టాలీవుడ్‌లో మర్డర్ పాప ఎంట్రీ.. అందాలతో చంపేస్తోంది!

బాలీవుడ్‌లో హాట్ హాట్ అందాల ఆరబోతతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ మల్లికా షెరావత్, ఒక దశాబ్ద కాలం పాటు బాలీవుడ్ జనాలను తన అందచందాలతో ఉర్రూతలూగించింది. ముఖ్యంగా అప్పట్లో వచ్చిన మర్డర్ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు. ఇక ఘాటైన లిప్‌లాక్‌లతో అమ్మడు రచ్చ లేపడంతో అప్పట్లో ఎలాంటి ఫైర్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఇక కాలక్రమంలో సినిమా ఛాన్సులు తగ్గడంతో ఆమె కేవలం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగు నాట తన అందాల ఆరబోతతో ఇక్కడి జనాలకు పిచ్చెక్కించేందుకు రెడీ అవుతోంది. అవును.. బాలీవుడ్ ఐటెం బాంబ్ మల్లికా షెరావత ఇప్పుడు తెలుగులో ఓ సినిమాలో నటించనుంది. అయితే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా తెరకెక్కుతుండటం విశేషం. ఇక ఈ సినిమాకు ‘నాగమతి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా, ఈ సినిమా 1900, 1947, 1990 వంటి వివిధ కాలాల్లో చోటు చేసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా ఈ సినిమా ముహూర్తం ఇటీవల ముంబైలో నిర్వహించగా, రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అమ్రిష్ గణేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌గా రానుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫేడవుట్ అవుతున్న ఈ హాట్ ఐటెం బాంబ్ ఈ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కుతుందా లేదా అనేది ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.