కత్రినాకైఫ్ ఆస్తి అన్ని కోట్లా..!!

మల్లీశ్వరి , అల్లరి పిడుగు వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కత్రినాకైఫ్, ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది కత్రినాకైఫ్. అంతే కాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలో కూడా ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఒక్కొక్క సినిమాకు ఏకంగా 11 కోట్ల రూపాయలను పారితోషికంగా పుచ్చుకుంటుందట.

ఇకపోతే కత్రినాకైఫ్ ఆస్తి వివరాల విషయానికి వస్తే, ఈమెకు ఏకంగా రూ. 230 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. కత్రినా కైఫ్ కు అత్యంత విలువైన బంగ్లాలు, ఫ్లాట్లు, కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. తాజాగా కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటించిన సూర్యవంశీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 150 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ రికార్డు గా నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో ఇంత కలెక్షన్లు రావడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా తర్వాత ఆమె స్టార్ స్టేటస్ కూడా మరింత పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సహనటుడు అయినటువంటి విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడుపుతోందని.

Share post:

Latest