బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ కి వచ్చేది ఎవరో తెలుసా..?

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలకు కొద్దిగ గ్యాప్ ఉన్నందువల్ల, బాలకృష్ణ ఆహలో “unstoppable”అనే ఇంట్రెస్టింగ్ టాక్ షో ని చేస్తూ అందులో సూపర్ హిట్ విజయాన్ని సాధించాడు.

మరి ఈ షో లో ఆల్రెడీ రెండు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.అదేమిటంటే బాలకృష్ణ తో కలసి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ షో లో పాల్గొనపోతున్నాడు అని, వీరిద్దరి మధ్య సంభాషణ ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం.

అయితే వీరిద్దరూ కలిసి ఈ షోలో ఉండడం వల్ల ఆ షోకి ఇంకెంత ఎనర్జిటిక్ గా ఉంటుందో అని, నెటిజన్లు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ “unstoppable” షోలో ఒకదాన్ని మించి, మరొక ఎపిసోడ్ ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు.

Share post:

Latest