అభిమాని దెబ్బకి..రాధేశ్యామ్ సినిమా నుంచి బిగ్ అప్డేట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం” రాధే శ్యామ్”. ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్న.. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని వార్త వచ్చినప్పటికీ.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు సడన్ గా “రాధే శ్యామ్”  అప్డేట్ కీ  సంబంధించి డేట్ అండ్ టైం తో సహా ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఒక బిగ్ అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ సడన్ బేగ్ అప్డేట్ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆ డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల కాబోతుందని పొందుపరచడం కూడా జరిగింది.

Share post:

Latest