హరితేజ కూతురిని చూశారా ఎంత ముద్దుగా ఉందో?

నటి, యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై, వెండితెరపై నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇక ఈమె ఈ ఏడాది ఏప్రిల్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే.

అంతేకాకుండా ఆ పాపకు బారసాల నిర్వహించి భూమి దీపక్ రావు అని పేరు నామకరణం చేశారు. ఇక భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపం వస్తే భూకంపమే అంటూ కూతురు పేరు కూడా వెనుక అర్థం కూడా చెప్పింది హరితేజ.

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హరితేజ తన కూతురు కి సంబంధించిన వీడియోస్,ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అలాగే తన భర్త దీపక్ రావు తన పాపను ఆడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకు అవి కాస్త అవుతున్నాయి.

తెల్లగా వైట్ గౌన్ లో ఉన్న ఈ చిట్టి పాప, చూడటానికి నవ్వుతూ చాలా అందంగా క్యూట్ గా ఉంది. ఇకపోతే హరితేజ విషయానికి వస్తే ఈమె బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ, మరొక పక్క యాంకర్ గా చేస్తూ, అలాగే సినిమాల్లో కూడా నటించింది.

ఇక అదే పాపులారిటీ తో ఆమె బిగ్ బాస్ మొదటి సీజన్ లో అడుగు కూడా పెట్టింది. ఇక ఆ తరువాత ఈమె 2015లో దీపక్ రావు ను పెళ్లాడింది.

Share post:

Latest