వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీప్ గెస్ట్ గా హాజరైన మెగా హీరో..!!

కొత్త దర్శకురాలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ.. వరుడు కావలెను అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో నాగశౌర్య, రీతూవర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వరుడు కావలెను’. ఈ సినిమాను అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వినూత్న రీతిలో చేపడుతున్నారు మేకర్స్. హైదరాబాదులో జరిగిన పలు పెళ్లిళ్లకు కూడా రీతూ వర్మ , నాగశౌర్య హాజరయ్యి అక్కడ కూడా వరుడు కావలెను సినిమా ప్రమోషన్స్ చేయడం గమనార్హం. ఇక అందులో భాగంగా ఇటీవల ‘వరుడు కావలెను’ చిత్రం సంగీత్ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.. ఇక అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా జరపనున్నారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

- Advertisement -

ఇటీవల విడుదలైన ‘వరుడు కావలెను’ మూవీ ట్రైలర్, అంతకు ముందు విడుదలైన సింగిల్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో నాగశౌర్య నటించిన ‘కళ్యాణవైభోగమే’ హిట్ మూవీని ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నారు. అది కూడా వివాహ నేపథ్యంలో ఫ్యామిలీ రిలేషన్స్ ను హైలైట్ చేస్తూ సాగుతుంది. ‘వరుడు కావలెను’ సినిమా కూడా అదే నేపథ్యంలో డిఫరెంట్ కథా కథనాలతో ఉండబోతోంది. నాగశౌర్య స్ర్కీన్ ప్రెజెన్స్, రీతూవర్మ గ్లామర్ అప్పీరెన్స్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

Share post:

Popular