ల‌క్ అంటే అన‌సూయ‌దే..ఆ స్టార్ హీరోయిన్‌ను కాద‌ని రంగ‌మ్మ‌త్త‌కు ఆఫ‌ర్‌?!

అనసూయ భరధ్వాజ్ అంటే తెలియ‌ని వారుండ‌రు. బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై సైతం స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం మ‌న రంగ‌మ్మ‌త్త ఓవైపు టీవీ షోలు చేస్తూనే.. మ‌రోవైపు పెద్ద పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకుపోతోంది.

Tamannaah Master Chef Telugu Ad | MS entertainments - YouTube

ఇక తాజాగా ఈ భామ‌ను మ‌రో బిగ్ ఆఫ‌ర్ వ‌రించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వరల్డ్స్‌‌ మోస్ట్‌‌ పాపులర్ కుకింగ్‌‌ రియాలిటీ షో `మాస్టర్‌‌‌‌చెఫ్‌‌` ను జెమినీ టీవీ వారు తెలుగులోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ షోకు త‌మ‌న్నా హోస్ట్‌. అయితే భారీ అంచ‌నాల న‌డుము ప్రారంభ‌మైన ఈ షో రేటింగ్స్ ప‌రంగా ఘోరంగా విఫ‌ల‌మైంది. త‌మ‌న్నా క్రేజ్ ఈ షోను ఏ మాత్రం పైకి లేప‌లేక‌పోయింది. పైగా సినిమా కమిట్మెంట్స్ ఉండడంతో త‌మ‌న్నా డేట్స్ అన్నీ ఫుల్ అయ్యాయ‌ట‌.

Anasuya replaces Tamannaah

ఈ నేప‌థ్యంతోనే త‌మ‌న్నాను త‌ప్పించి.. ఆమె ప్లేస్‌లో అన‌సూయ‌ను రంగంలోకి దింపాల‌ని షో నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నార‌ట‌. బుల్లితెర‌పై అన‌సూయ మంచి ఫాలోయింగ్ ఉంది. అందు వ‌ల్ల‌నే, త‌మ‌న్నాను కాద‌ని అన‌సూయ వైపు మొగ్గు చూపుతున్నార‌ట‌. ఇక ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. ఈ షోకు గానూ అన‌సూయ‌కు భారీ రెమ్యూన‌రేష‌న్ కూడా ఇస్తున్నార‌ని టాక్‌. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Share post:

Latest