సమంత డైరెక్టర్ తో చైతూ.. హిట్ కొడతాడా..?

సమంత – నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడి గా గుర్తింపు పొందిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే వీరు ఒకరికొకరు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని మరీ కొత్తగా ప్రారంభించడం కోసం సినిమాల బాట పట్టారు.. ఈ నేపథ్యంలోనే సమంత తెలుగు, తమిళ , హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, నాగచైతన్య కూడా అప్పటికే కమిట్ అయిన సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు..

ఇకపోతే అక్కినేని నాగచైతన్య ఇప్పటికే మజిలీ , వెంకీ మామ, లవ్ స్టోరీ వంటి హ్యాట్రిక్ హిట్లతో తన సత్తా చాటుకున్నాడు.. ఇప్పుడు మరో వైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ సినిమాతో త్వరలో మన ముందుకు రావడానికి సిద్దమవున్నాడు. ఇక ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత.. అక్కినేని నాగచైతన్య, తన భార్య అక్కినేని సమంత కు సూపర్ డూపర్ విజయాన్ని అందించిన ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

Nandini Reddy to direct Naga Chaitanya?- Cinema express

థాంక్యూ సినిమా తర్వాత లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తో నాగచైతన్య మరొక సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.. ప్రస్తుతం దర్శకురాలు నందిని రెడ్డి.. సంతోష్ శోభన్ అనే ఒక యువ హీరోతో అన్నీ మంచి శకునములే అనే సినిమా చేస్తోంది.ఈ సినిమా తర్వాత ఆమె నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోంది.. అంతేకాదు ఈ సినిమా నందిని రెడ్డి డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సినిమా వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఓ బేబీ సినిమా హిట్ అందుకున్న ఈమె సంతోష్ శోభన్ సినిమాను కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా చేస్తోంది ..ఈ సినిమా తర్వాత నాగచైతన్య తో మరో క్రేజీ లవ్ స్టోరీ తో ముందుకు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఇదే కాదు చైతూ మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట..

ఇక ఈ విషయం తెలుసుకున్న అందరూ సమంతకు మంచి విజయాన్ని అందించిన నందినీ రెడ్డి.. నాగచైతన్యకి కూడా మంచి విజయాన్ని అందిస్తుంది అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Share post:

Latest