పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు..!!

సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురి అవడంతో పాటు శోకసంద్రంలో మునిగిపోయింది.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ పుత్ ఇక లేరు అన్న వార్త వినడం తో అందరూ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.. కుటుంబ సభ్యులతో పాటు ప్రేక్షకులు, అభిమానులు , సినీ తారలు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.. పునీత్ రాజ్ పుత్ కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. ఆయన ఒక సంచలనం.. 1975 మార్చి 17వ తేదీన జన్మించిన పునీత్ రాజ్ ఒక నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్లేబాక్ సింగర్ గా, టెలివిజన్ లో ప్రసారమయ్యే కొన్ని షోలకు యాంకర్ గా కూడా మొదట్లో పనిచేశారు.

అంతే కాదు నిర్మాతగా అడుగులు వేసిన పునీత్ రాజ్ పుత్ ఏకంగా 29 సినిమాలను తన సొంత బ్యానర్పై నిర్మించడం గమనార్హం. 1980వ సంవత్సరంలో వచ్చిన వసంత గీత అనే కన్నడ ఫిలిం ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన అనతికాలంలోనే పవర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో 11:30 గంటలకు బెంగళూరు లోని కావేరి హాస్పిటల్ లో చేర్పించగా, ఐసియులో చికిత్స పొందుతూ ఆయన హఠాన్మరణం పొందారు.. ఇక ప్రస్తుతం ఈ వార్తను ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

https://twitter.com/TheAakashavaani/status/1454004004392816641