పునీత్ మ‌ర‌ణించినా.. ఆయ‌న క‌ళ్లు మ‌న‌ల్ని చూస్తూనే ఉంటాయి!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో హఠాన్మరణం చెంద‌డాన్ని ఎవ్వ‌రూ జీర్ణియించుకోలేక‌పోతున్నారు.

Puneeth Rajkumar suffers heart attack, admitted to hospital in Bengaluru - Movies News

నేటి ఉద‌యం జిమ్‌ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో హుఠాహుఠిన విక్రమ్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఇక అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి.. తుది శ్వాస విడిచారు. అయితే పునీత్ మ‌ర‌ణించినా.. ఆయ‌న క‌ళ్లు మాత్రం మ‌న‌ల్ని చూస్తూనే ఉంటాయి. అవును, . పునీత్ రాజ్ కుమార్ ఆయన కళ్ళను దానం చేశారు.

puneeth rajkumar: Puneet Rajkumar, who visited Shkremagro's Sacrebile; Because of the surprise - actor puneeth rajkumar visited shivamogga sakrebailu elephant camp » Jsnewstimes

ఈ విష‌యాన్ని ఆయన కుటుంబీకులు స్వ‌యంగా తెలిపారు. గతంలో పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను మరొకరి కోసం దానం చేశారు. కాగా. పునీత్ మ‌రణంతో క‌న్న‌డ సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్ర‌మంలోనే పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.