ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి.. రాజీనామా..!

మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఓడిపోవడం జరిగింది మంచు విష్ణు చేతిలో. ఈ రోజున కొద్ది నిమిషాల ముందు ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అంటూ తెలియజేశాడు. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎలక్షన్ లో గెలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కంగ్రాట్యులేషన్స్ తెలిపారు ప్రకాష్ రాజ్.

- Advertisement -

నేను సినీ ఇండస్ట్రీ లో ఉండే సమస్యలను విన్నాను. ఆ సమస్య ఏమిటో మీకు తెలుసు మీడియా కూడ తెలుసు అని తెలియజేశాడు. కానీ నేను తెలుగు వాడిని కాదంటూ జాతీయవాదం చేయడంలో నేను ఓడిపోవడానికి ముఖ్య కారణం అని చెప్పుకొస్తున్నాడు. ప్రకాష్ రాజ్ తెలుగోడు కాదు ఓటు వేయవచ్చు కానీ మా ఎలక్షన్లు నిలబడ కూడదు అని నినాదం చేశారు.

ప్రకాష్ రాజు నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు.. అది నా తప్పు కాదు కదా, అలాగని వారి తప్పు కూడా కాదు కదా అని తెలియజేశాడు. ఒక తెలుగు బిడ్డ ని, ఆ తెలుగు ఆర్టిస్ట్ సభ్యులు ఎన్నుకున్నారు ఇది అంగీకరించాల్సిన విషయమే..అందుచేతనే నేను ఈ రాజీనామా చేస్తున్నట్లు గా తెలియజేశాడు ప్రకాష్ రాజ్ .

Share post:

Popular