మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోటో షూట్.. మహేష్ – నమ్రత లుక్ సూపర్?

టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు నమ్రతల జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే ఈ జంట కు సంబంధించి మ్యాగజైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్ కు ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు. ఇదే విషయాన్ని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

నా సూపర్ ఉమెన్ తో కలిసి హలో మ్యాగజైన్ కు ఇచ్చిన ఫోటోలు ఇవి. తనతో కలసి ఈ ప్రాజెక్టులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హలో మ్యాగజైన్ కోసం వారు పలు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందులో ఫార్మల్ షూట్ లో ఈ జంట ఇచ్చిన ఆ ఫోటోలు నెటిజన్లను, అలాగే మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా హలో మ్యాగజైన్ కవర్ పేజి కి ఫోటో షూట్ ఇచ్చిన తొలి సెలబ్రిటీ కపుల్ గా మహేష్ నమ్రత లు నిలిచారు.

Share post:

Latest