మా ఎన్నికలకు డుమ్మా కొట్టిన అక్కినేని ఫ్యామిలీ..నాగ్ తప్పా..!

సినీ ఇండస్ట్రీ లో ఈ రోజు మా ఎలక్షన్ లు జరుగుతున్న విషయం తెలిసిందే కాబట్టి..ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంతకు ముందే చాలా మంది ప్రచారాలలో పాల్గొంటూ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలను కూడా వెల్లడించారు. నాగార్జున ఫ్యామిలీ మాత్రం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను ఎన్నికలలో ఓటు వేస్తారా లేదా అనే విషయాన్ని కూడా ఎవరికీ చెప్పలేదు. అయితే అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఓటు వేస్తారా లేదా అనే విషయంపై ప్రతి ఒక్కరు తమ సందేహాలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.

కానీ అక్కినేని హీరో నాగార్జున మా ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు. ఇప్ప‌టిదాకా ఉన్న సందేహాలు అన్నింటినీ ప‌టాపంచ‌ల్ చేస్తూ నాగార్జున పోలింగ్ ప్రాంగణానికి వ‌చ్చి, తన ఓటు హ‌క్కు వినియోగించుకుని, ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి చాటారు. అదేవిధంగా స‌భ్యుల‌తో మాట్లాడి వారిలో ఉత్సాహం కూడా నింపారు. త‌న స్నేహితుల‌తో, స‌న్నిహితుల‌తో మాట్లాడి వెళ్లారు. మరోవైపు అక్కినేని హీరోలు అయిన నాగ చైతన్య, అఖిల్ ఓటేస్తారా లేదా అన్న‌ది స‌స్పెన్స్ గానే ఉంది.

మా ఎన్నిక‌ల‌కు అక్కినేని కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఓ సంద‌ర్భంలో మా అధ్య‌క్షుడిగా నాగార్జున ప‌నిచేశారు. ఇక ఇరు ప్యానెల్స్ కు సంబంధించిన పోటీదారుల‌తోనూ ఆయ‌న‌కు మంచి సంబంధ బాంధ‌వ్యాలు ఉన్నాయి. క‌నుక ఆయన ఓటు ఎటు అన్న‌ది స‌స్పెన్స్ గానే ఉంది. నాగ్ కు ప్ర‌కాశ్ రాజ్ అన్నా, అటు మోహ‌న్ బాబు అన్నా మంచి ప్రేమే ఉంది.అయితే ఈ ప్రేమ ఈ సారి ఎవ‌రివైపు ఎక్కువ ఉండ‌నుంది అన్న‌ది తేలాలిక‌.

Share post:

Latest