కామంతో బాలింతలను కూడా వదలని వలంటీర్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా గ్రామ సచివాలయ లను ఏర్పాటుచేసి, అందులో అధికారులతో పాటు వలంటీర్లను కూడా నియమించిన విషయం తెలిసిందే. ఈ వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ , ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటారు.. ఇకపోతే ఒక కామోన్మాధి మాత్రం తన కోరిక తీర్చుకుంటే నీ అంతు చూస్తానంటూ ఏకంగా బాలింత పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంతకంటే దారుణం బహుశా మరెక్కడా మనకు కనిపించదేమో..

పూర్తి వివరాల్లోకి గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో ఓ వలంటీర్ బాలింత అని కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేయడంతో ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న బాలింత భయంతో రోడ్డుపైకి పరుగులు తీసింది. ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించిన ఆ వలంటీర్ అక్కడ నుంచి నెమ్మదిగా ఉడాయించాడు. ఇక ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో భయపడిన మహిళ బయటకు పరుగులు తీసింది. ఎవరికైనా చెబితే ఊళ్లో తిరగలేవంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వలంటీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share post:

Popular