నలుగురు హీరోయిన్లతో సందడి చేయబోతున్న రాఘవేంద్రరావు?

దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరో హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పటివరకు సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు హీరోగా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు తనికెళ్ల భరణి దర్శకుడిగా వ్యవహరించనున్నారట. దర్శకేంద్రుడు కోసం ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకంగా కథ రెడీ చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అందుకోసం స్క్రిప్టు కూడా పూర్తి అయిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు జోరుగా వార్తలు కొనసాగుతున్నాయి.

ఇందులో ఆయన నలుగురు హీరోయిన్లతో కలసి సందడి చేయబోతున్నారట. ఈ సినిమాతో పాటుగా మరొక సినిమాలో కూడా రాఘవేంద్రరావు నటించనున్నారట. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే రానుందట. ఓం నమో వెంకటేశ సినిమా తర్వాత రాఘవేంద్రరావు దర్శకుడిగా మరో సినిమా చేయలేదు. దీంతో అతను రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు అని అందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర హీరో గా తెరపై అలరించబోతున్నాడు అని తెలియడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Share post:

Popular