బాలయ్య షోలో పాల్గొన్న మంచు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్..!

నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓటిటి వేదిక ఆహలో “అన్ స్టాపబుల్” అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. దినికి నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నాడు. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈ షో లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ షోలో ప్రత్యేక గెస్ట్ గా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలె ఈ టాక్ షో కు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది. అందులో బాలయ్య స్టన్నింగ్ లుక్ స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ షో మొదట డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు, కూతురు మంచు లక్ష్మితో కలిసి పాల్గొంటున్నట్లు గా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక త్వరలోనే ఈ షోకి సంబంధించి ఒక ప్రోమో విడుదల కానున్నట్లు గా సమాచారం.

https://twitter.com/ahavideoIN/status/1454473525041926144?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454473525041926144%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-21501818972641047735.ampproject.net%2F2110152252002%2Fframe.html