అఖండ సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం చేత ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ మధ్య కాలంలోనే తిరిగి మళ్ళీ రీ షూటింగ్ చేసుకొని ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో విడుదల తేదీని కి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు గా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్పై వినిపిస్తున్న మాట ఏమిటంటే ఈ సినిమాకి దాదాపుగా 95 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఇక ఈ వార్త నిజమైతే బాలకృష్ణ కెరియర్ లో ఇది అత్యధిక బడ్జెట్ సినిమాగా ఉండబోతోంది. కానీ బాలకృష్ణ అభిమానులకు మాత్రం చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ వరుస ఫ్లాప్ లతో ఉండడంతో ఇక ఈ సినిమా ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.